Home  »  TV News  »  బ్రహ్మముడి సెట్ లో మానస్ బర్త్ డే సెలబ్రేషన్స్!

Updated : Aug 12, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్  ఇప్పుడు ఎంత ట్రెండింగ్ లో ఉందో అందరికి తెలిసిందే. ఒక్కో ఎపిసోడ్ ఒక్కోలా ఉంటూ ప్రతీరోజు సరికొత్తగా అందిస్తుంది ఈ సీరియల్. ఇందులో చేస్తున్న రాజ్(మానస్) బర్త్ డే జరిగింది. దాంతో 'బ్రహ్మముడి' సెట్ లో అతని పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరిపారు. ఈ విషయాన్ని కావ్య(దీపిక రంగరాజు) తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసిన ఒక వ్లాగ్ లో చెప్పింది.

బ్రహ్మముడి సీరియల్ లో కావ్యని రాజ్ తన ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకుంటాడు‌. దాంతో ఇంట్లోకి వచ్చాక రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ ఇంట్లో ఒక పనిచేసే వాళ్ళలాగా ఒక స్టోర్ రూమ్ లో కొన్నిరోజులు ఉంచుతుంది. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అపర్ణని రిక్వెస్ట్ చేయగా రాజ్ గదిలో పడుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. దాంతో కావ్య సంతోషపడుతుంది. అయితే కావ్య తన పుట్టింటికి సాయం చేయాలనుకుంటుంది‌‌. దాంతో తనే సొంతంగా డిజైన్స్ చేసి రాజ్ కి పంపించగా అవి రాజ్ కి నచ్చుతాయి. దాంతో తనకి కొంత డబ్బులు ఇస్తాడు రాజ్. ఆ డబ్బులని కావ్య తన పుట్టింటికి తీసుకొస్తుంది. అయితే కావ్యని ఎలాగైనా ఇరికించాలని భావించిన స్వప్న అపర్ణకి వినపడేలా.. కావ్య డబ్బులు తీసుకొని పుట్టింటికి వెళ్ళిందని చెప్తుంది. అలా చెప్పడంతో కావ్యపై అపర్ణ ఫుల్ ఫైర్ అవుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ పరువు పోయిందని ఇంట్లో వాళ్ళంతా కావ్యని తిడుతుంటారు. దాంతో అందరికి పరువు మళ్ళీ కాపడతానని చెప్తుంది కావ్య. మరి కావ్య ఏం చేసింది. దుగ్గిరాల ఇంటి పరువు మళ్ళీ కాపాడిందా అనేది ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్ లలో కొనసాగుతుంది.

కాగా బ్రహ్మముడి సెట్ లో మానస్ పుట్టిన రోజు వేడుకలని ఈ సీరియల్ యూనిట్ అంతా కలిసి సెలబ్రేట్ చేశారు. అయితే రాజ్(మానస్) కోసం కావ్య స్పెషల్ వంటలు చేపించినట్లు చెప్పింది. చికెన్ ఫ్రై, ఎగ్ పులుసు, పప్పు అంటూ వివరించింది. అయితే రాజ్ కోసం స్పెషల్ గా తన చేతితో చపాతి చేస్తున్నట్టు చేసి చూపించింది. ఆ తర్వాత ఒక కేక్ ని తెప్పించి, రాజ్ తో కట్ చేపించి అందరికి షేర్ చేసింది దీపిక. అలా సరదాగా గడిపిన రాజ్ పుట్టిన రోజు వేడుకని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది దీపిక రంగరాజు. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.